మొబైల్ సిగ్నల్‌ సరిగ్గా రావడం లేదా ? మీ ఇంటి చుట్టూ ఉండేవారు ఇలా చేస్తున్నారేమో చూడండి..!

-

మొబైల్‌ నెట్‌వర్క్‌ సిగ్నల్‌ సమస్యను ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్నారు. కాల్‌ డ్రాప్స్‌ ఎక్కువవుతున్నాయి. ఎవరికైనా కాల్‌ చేద్దామంటే సిగ్నల్‌ సరిగ్గా ఉండడం లేదు. ఇంటి నుంచి బయటికి వచ్చి కాల్‌ చేసినా కాల్‌ కనెక్ట్‌ అయ్యేందుకు సమయం పడుతోంది. ఇంకో వైపు సిగ్నల్‌ సమస్య కారణంగా కాల్‌ మాట్లాడేటప్పుడు కూడా కాల్‌ ఆటోమేటిగ్గా కట్‌ అవుతోంది. ఈ సమస్యలను ప్రస్తుతం చాలా మంది మొబైల్‌ వినియోగదారులు ఎదుర్కొంటున్నారు.

అయితే మొబైల్‌ నెట్‌వర్క్‌ సిగ్నల్‌ను పెంచాలంటే ఆ పని సంబంధిత టెలికాం కంపెనీ వారు చేయాలి. కానీ వినియోగదారులు కొందరు తమ ఇళ్లపై సిగ్నల్‌ బూస్టర్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇలా చేయడం ఎక్కువైంది. ఇంటి పైకప్పు మీద సిగ్నల్‌ బూస్టర్‌లను ఏర్పాటు చేయడం వల్ల మొబైల్‌ సిగ్నల్‌ పెరుగుతుంది. ఇంటర్నెట్‌ స్పీడ్‌గా వస్తుంది. కాల్‌ డ్రాప్స్‌ ఉండవు. కానీ ఈ బూస్టర్‌లను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి లేదు. టెలికాం శాఖ ఈ బూస్టర్‌లను ఏర్పాటు చేసుకోవడాన్ని నిషేధించింది.

కానీ కొందరు వినియోగదారులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా మొబైల్‌ సిగ్నల్‌ బూస్టర్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో వారికి సమస్య తీరుతోంది. కానీ వారి చుట్టూ వారికి నెట్‌వర్క్‌ సమస్యలు వస్తున్నాయి. ఢిల్లీలో ఇటీవలి కాలంలో ఇలా మొబైల్‌ సిగ్నల్‌ బూస్టర్‌లను ఏర్పాటు చేసుకునే వారి సంఖ్య పెరిగింది. దీంతో అలాంటి వారిని గుర్తించి వారి ఇళ్లపై ఏర్పాటు చేసిన బూస్టర్‌లను అధికారులు తొలగిస్తూ వారిపై చర్యలు తీసుకుంటున్నారు. కనుక మీకు కూడా నెట్‌వర్క్‌ సమస్య మరీ ఎక్కువగా ఉంటే ఇలా ఎవరైనా బూస్టర్‌లను ఏర్పాటు చేస్తున్నారేమో ఒకసారి గమనించండి. ఆ బూస్టర్‌లను తీసేస్తే మీక్కూడా సమస్య పరిష్కారం అయ్యేందుకు అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version