గుడ్​న్యూస్ చెప్పిన ఇస్రో.. ప్రజ్ఞాన్‌ మేల్కోవడంపై ఆశలు సజీవమేనట

-

భారతదేశం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి.. ఆ ఘనత సాధించిన తొలి దేశంలో ప్రపంచంలో హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే 14 రోజుల పాటు చంద్రుడి గురించి విలువైన సమాచారాన్ని అందించి ఆ తర్వాత అక్కడ చీకటిపడటంతో ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్‌-3 ని నిద్రాణస్థితికి పంపారు. సెప్టెంబర్ 22న అక్కడ సూర్యోదయం కావడం వల్ల అప్పటి నుంచి చంద్రయాన్-3ని మేల్కొలిపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ అవి మేల్కోకపోవడంతో.. ఇక ఆశలు కనిపించడం లేదని అందరూ అనుకున్నారు. ఇక చంద్రయాన్-3 ప్రయాణం ముగిసినట్టేనని ఇస్రోతో పాటు అంతా భావించారు.

కానీ తాజాగా ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ చెప్పిన మాటలు విని ఒక్కసారిగా అందరిలో ఆశ మరోసారి పురుడు పోసుకున్నట్లైంది. జాబిల్లిపై నిద్రాణ స్థితిలో ఉన్న చంద్రయాన్‌-3 రోవర్‌ (ప్రజ్ఞాన్‌) తిరిగి క్రియాశీలంగా మారే అవకాశాల ఉన్నాయని సోమనాథ్ తెలిపారు. ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయని.. కొచ్చిన్‌లో గురువారం ఓ వార్తాసంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వెల్లడించారు.

జాబిల్లిపై ప్రస్తుతం ప్రజ్ఞాన్‌ ప్రశాంతంగా నిద్రిస్తోందని.. దాన్ని కదిలించకుండా.. నిద్రపోనిద్దామని.. తనంతట తాను క్రియాశీలమవ్వాలని అనుకున్నప్పుడు అది మేల్కోగలదు అని సోమనాథ్ చెప్పారు. రోవర్‌ను తాము మైనస్‌ 200 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద పరీక్షించినప్పుడు అది పనిచేసిందని.. జాబిల్లిపై ప్రజ్ఞాన్‌ మళ్లీ క్రియాశీలమవుతుందని ఆశలు పెట్టుకోవడానికి అదే కారణమని ఆయన స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version