BREAKING : గుజరాత్ ఆప్ సీఎం అభ్యర్థి పేరు ఖరారు అయింది. గుజరాత్ ఎన్నికల్లో ఆప్ సీఎం అభ్యర్థి గా ఇసుధన్ గధ్వి బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు ఆప్ పార్టీ అధికారిక ప్రకటన చేసింది. అంతేకాదు.. గుజరాత్ లోని అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులను పెట్టి.. గెలవబోతున్నట్లు కూడా ప్రకటించింది.
కాగా..గుజరాత్ అసెంబ్లీలోని మొత్తం 182 స్థానాలున్నాయి. ఆ రాష్ట్ర అసెంబ్లీ గడువు ఫిబ్రవరిలో ముగియనుంది. మామూలుగా గుజరాత్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండేది. కానీ ఈసారి ఆప్ ఎంట్రీతో సీన్ మారే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే అభ్యర్థుల లిస్టు విడుదల చేయడంతో గుజరాత్లో ఈ సారి బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ మధ్య ముక్కోణపు పోటీ ఖాయమని తెలుస్తోంది.
Isudan Gadhvi, National Joint General Secretary of Aam Aadmi Party (AAP), announced as the party's CM candidate for the upcoming #GujaratElections2022 pic.twitter.com/GYWoZjbXJ8
— ANI (@ANI) November 4, 2022