ఛత్తీస్‌గఢ్ భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్ భారీ ఎన్ కౌంటర్ అయిన నేపథ్యంలో 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో నేషనల్ పార్క్ దగ్గర భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఉదయం పూట జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో 12 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది.
ఛత్తీస్‌గఢ్‌లో పంచాయతీ ఎన్నికలకు ముందు బీజాపూర్‌లోని నేషనల్ పార్క్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిందని చెబుతున్నారు. ఈ రోజు ఉదయం నుంచి డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్ మరియు బస్తర్ ఫైటర్‌ల ఎన్‌కౌంటర్ జరుగుతోంది. 12 మంది మృతి చెందినప్పటికీ… భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతిపంచాయతీ ఎన్నికలకు ముందు బీజాపూర్‌లోని నేషనల్ పార్క్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్
- బీజాపూర్‌లో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు
- ఈ రోజు ఉదయం నుంచి డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్ మరియు బస్తర్ ఫైటర్‌ల ఎన్‌కౌంటర్