ఆప్ విజయ అవకాశాలను దెబ్బతీసింది కాంగ్రెస్ పార్టీ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏకంగా 13 చోట్ల ఆప్ విజయ అవకాశాలను దెబ్బతీసిందట కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో…. 22 స్థానాల్లో గెలుపొందింది ఆప్ పార్టీ. ఇందులో మ్యాజిక్ ఫిగర్ నెంబర్ 36 సీట్లు మాత్రమే. ఒక్క స్థానంలో కూడా గెలవకుండానే 13 చోట్ల కాంగ్రెస్ ఎఫెక్ట్… ఆప్ పైన పడింది.
అంటే… బీజేపీ విజయానికి పరోక్షంగా సహకరించింది కాంగ్రెస్ పార్టీనే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక అటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఏపీలోని పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. 27 ఏళ్ల తరవాత ఢిల్లీ పీఠం కైవసం చేసుకోవడం పై ఆనందం వ్యక్తం చేశారు. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ఢిల్లీ గడ్డ బీజేపీ అడ్డా అంటూ నినాదాలు చేశారు.
13 చోట్ల ఆప్ విజయ అవకాశాలను దెబ్బతీసిన కాంగ్రెస్
22 స్థానాల్లో గెలుపొందిన ఆప్
మ్యాజిక్ ఫిగర్ నెంబర్ 36 సీట్లు
ఒక్క స్థానంలో కూడా గెలవకుండానే 13 చోట్ల కాంగ్రెస్ ఎఫెక్ట్
బీజేపీ విజయానికి పరోక్షంగా సహకరించిన కాంగ్రెస్#AAP #Congress #BJP@ArvindKejriwal… pic.twitter.com/piH51xEhfj
— Pulse News (@PulseNewsTelugu) February 9, 2025