BBC కార్యాలయాల్లో మూడో రోజు ఐటీ ‘సర్వే’

-

బీబీసీ ఇండియా కార్యాలయాల్లో ఐటీ అధికారులు మూడోరోజు సర్వే నిర్వహిస్తున్నారు. ఇవాళ ముంబయి, దిల్లీలోని బీబీసీ కార్యాలయాలకు చేరుకున్న ఆదాయ పన్ను శాఖ అధికారులు.. ఎలక్ట్రానిక్‌ రూపంలో, దస్త్రాల్లో ఉన్న ఆర్థిక వ్యవహారాల సమాచారం నకలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మంగళవారం ఉదయం 11.30 నిమిషాలకు దిల్లీ, ముంబయి బీబీసీ కార్యాలయాల్లో మొదలైన సర్వే ఇంకా కొనసాగుతోంది. ఈ సర్వే మరికొంత కాలం జరుగుతుందని అధికారులు తెలిపారు.

‘లండన్ హెడ్ ఆఫీస్​తో పాటు భారత్​లోని కార్యాలయం బిజినెస్ ఆపరేషన్లకు సంబంధించిన డాక్యుమెంట్ల కోసం అధికారులు వెతుకుతున్నారు. బీబీసీ అనుబంధ కంపెనీలకు సంబంధించిన ట్యాక్స్​ వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇది పూర్తిగా బీబీసీ బిజినెస్ ఆపరేషన్లకు సంబంధించినదే’ అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

కొన్ని వారాల క్రితమే మోదీపై.. “ఇండియా.. ద మోదీ క్వశ్చన్” పేరిట బీబీసీ ఒక డాక్యుమెంటరీని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆదాయ పన్ను శాఖ అధికారులు.. బీబీసీపై సర్వే జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version