ఐపీఎల్ 2023 సీజన్ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. అయితే, తాజాగా ఐపీఎల్ 2023 సీజన్ లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ రాయల్స్ తో ఆదివారం జరిగిన 1000వ ఐపిఎల్ మ్యాచ్లో 6 వికెట్లు తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో యశస్వి జైస్వాల్ శతకం వృధా అయ్యింది.
అయితే, ముంబై పై సెంచరీ(124) చేసిన యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డు సాధించారు. జాతీయ జట్టుకు ఆడకుండా ఐపిఎల్ లో అత్యధిక స్కోరు సాధించిన క్రికెటర్ గా నిలిచారు. 2011లో పాల్ వాల్తాటి(పంజాబ్) చెన్నై పై 120* రన్స్, 2009లో మనీష్ పాండే(RCB) డెక్కన్ చార్జర్స్ పై 114* రన్స్ చేశారు. అలాగే మనీష్ పాండే(19Y, 253D), పంత్(20Y, 218D), పడిక్కల్(20Y, 123D) తర్వాత తక్కువ ఏజ్ లో(21Y, 123D) సెంచరీ చేసిన ప్లేయర్ గా యశస్వి నిలిచారు.