కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 13 క్రెడిట్ స్కీం ప్రజలు ఈజీగా వాడుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన “జన్ సమర్థ్” వెబ్ సైట్ ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ తాజాగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ… ఎండ్ టూ ఎండ్ డెలివరీ విధానం తో తీసుకువచ్చిన జన్ సమర్త్ తో ఆయా స్కీమ్లను ఉపయోగించుకోవడం మరింత సులభంగా ఉంటుందని ఆయన వెల్లడించారు.
ఈ పోర్టల్ ద్వారా లోన్లు పొందేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వస్తారని ఆయన ఆకాంక్షించారు. ఇంతకు ముందు ప్రభుత్వ స్కీం లా ప్రయోజనాలను పొందాలంటే ప్రజలు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉండేది. ఇప్పుడు ప్రజల వద్దకు పాలన తీసుకుపోతున్నాం. వివిధ మినిస్ట్రీ ల ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. అనేక వెబ్సైట్లను చూడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఒకే పోర్టల్ లో 13 క్రెడిట్ స్కీములను పొందవచ్చు అని ప్రధాని నరేంద్ర మోడి తెలిపారు.
ఆ 13 పథకాలు ఇవే :
కేంద్ర రంగ వడ్డీ రాయితీ
డాక్టర్ అంబేద్కర్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్
అగ్రిక్లినిక్ మరియు అగ్రిబిజినెస్ సెంటర్ల పథకం
మాన్యువల్ స్కావెంజర్ల పునరావాసం కోసం స్వయం ఉపాధి పథకం
దీనదయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్
ప్రధాన మంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి పథకం
వ్యవసాయ మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు
వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి
ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం
నేత ముద్రా పథకం
ప్రధాన మంత్రి ముద్రా యోజన
పధో పరదేశ్
స్టాండ్-అప్ ఇండియా పథకం