భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సూరన్ అజ్ఞాతం వీడారు. మంగళవారం మధ్యాహ్నం రాంచీలో ఆయన ప్రత్యక్షమయ్యారు. తన అధికార నివాసంలో ఆయన మంత్రులు, ఎమ్మెల్యే లతో భేటీ అయ్యారు. ఈ భేటీకి ఆయన సతీమణి కల్పన కూడా హాజరయ్యారు. దీంతో తాజా ఊహాగానాలే నిజం కానున్నాయా అనే చర్చ మొదలయింది.
ఈ నేపథ్యంలోనే గత రెండు మూడు రోజుల నుంచి అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు. దీంతో ఈడీ నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీలోని తన నివాసంలో దాదాపు 18 గంటల పాటు వేచి చూసింది. అయితే ఎట్టకేలకు రాంచీలో ఉన్నట్టు తెలిసింది. ఇక ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు ఉండడంతో అరెస్టుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఢిల్లీలోని తన నివాసానికి వెళ్లిన సోరన్ ఆ తర్వాత కనిపించకుండా పోయారు. అయితే ఆయన కోసం అక్కడికి వెళ్లిన ఈడీకి ఎదురుచూపులే మిగిలాయి. ఈ సాయంత్రం లోపు ఆయన అరెస్టు ఉంటుందా ఉండదా అనే ఆ దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సోరెన్ భార్యకు సీఎం పదవీ అప్పగించే అవకాశం కనిపిస్తోంది.