భారత్ లో 109కి చేరిన జేఎన్1 వేరియంట్ కేసులు

-

భారత్లో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. మరణాలు కూడా సంభవిస్తున్నాయి. దేశవ్యాప్తంగా నిన్న 529 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4,093కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. వైరస్ బారిన పడి మంగళవారం ముగ్గురు చనిపోయారని తెలిపింది. మరోవైపు దేశంలో కొత్త వేరియంట్ కేసులు కూడా రోజురోజుకు పెరుగుతున్నట్లు వివరించింది.

భారత్లో బుధవారం వరకు కొత్త వేరియంట్ జేఎన్1 కేసు 109 నమోదైనట్లు అధికారులు తెలిపారు. వీటిలో గుజరాత్ నుంచి 36, కర్ణాటక- 34, గోవా- 14, మహారాష్ట్ర- 9, కేరళ- 6, రాజస్థాన్- 4, తమిళనాడు- 4, తెలంగాణ నుంచి 2 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. మరోవైపు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లకు పెరిగిందని జాతీయ రికవరీ రేటు 98.81 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉందని పేర్కొన్నారు. దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్‌లు పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version