3 రాష్ట్రాల్లో కొత్త జేఎన్‌.1 వేరియంట్‌.. అంత ప్రమాదం లేదన్న డబ్ల్యూహెచ్‌వో

-

కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 వ్యాప్తి ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ముఖ్యంగా భారత్లో ఇది ప్రవేశించి చాపకింద నీరుల విస్తరిస్తోంది. కొత్త వేరియంట్ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింద. ఈ వేరియంట్కు సంబంధించి మూడు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 21 కేసులు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

అత్యధికంగా గోవాలో 19, కేరళ, మహారాష్ట్రలో ఒక్కొక్కటి చొప్పున ఈ కేసులు నమోదైనట్లు డాక్టర్‌ వి.కె.పాల్‌ తెలిపారు. ఈ కొత్త వేరియంట్‌ వ్యాప్తి దృష్ట్యా పరీక్ష కేంద్రాలను పెంచాలని, నిఘా వ్యవస్థలను బలోపేతం చేయాలని రాష్ట్రాలకు సూచించారు. జేఎన్‌.1 వేరియంట్‌ సోకిన వారిలో 91 నుంచి 92 శాతం మంది ఇంటి దగ్గరే చికిత్స పొందుతున్నారని చెప్పారు. కాబట్టి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. జేఎన్‌.1 ఉపరకాన్ని ‘వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’గా ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ… దీంతో ప్రజారోగ్యానికి ప్రమాదం తక్కువేనని పేర్కొంది. అయితే కరోనా కేసుల సంఖ్య మాత్రం పెరిగే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. ప్రజలంతా కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news