ఎన్నికల వేళ మరో వివాదం.. కచ్చతీవుపై శ్రీలంక రగడ

-

భారత్ లో లోక్‌సభ ఎన్నికల వేళ కచ్చతీవు ద్వీపం వ్యవహారం రాజకీయంగా వివాదం అవుతోంది. ఐదు దశాబ్దాల క్రితం కాంగ్రెస్‌ పార్టీ పూర్తి నిర్లక్ష్యంగా ఈ దీవిని శ్రీలంకకు ఇచ్చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా శ్రీలంక మత్స్యశాఖ మంత్రి డగ్లస్‌ దేవానంద స్పందిస్తూ.. కచ్చతీవును భారత్‌ తిరిగి స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్లకు ఎలాంటి ఆధారమూ లేదని వ్యాఖ్యానించారు.

ఇప్పుడు భారత్‌లో ఎన్నికల సమయం నడుస్తోందని, ఇలాంటి ప్రకటనలు వినిపించడం సహజమేనని డగ్లస్ అన్నారు. 1974 నాటి ఒప్పందం ప్రకారం.. కచ్చతీవును శ్రీలంకకు అప్పగించినా, ఇరు దేశాల మత్స్యకారులు ప్రాదేశిక జలాల్లో రెండు వైపులా చేపలు పట్టుకోవచ్చని తెలిపారు. 1976లో మరో ఒప్పందం కుదిరిందని గుర్తు చేశారు. దాని ప్రకారం.. సముద్రంలో సరిహద్దులు విభజించారని, ఒక దేశం జాలరులు మరొకరి జలాల్లో చేపల పట్టడం నిషిద్ధం అని చెప్పారు. కన్యాకుమారికి దిగువన వెస్ట్‌బ్యాంక్‌ పేరుతో పిలిచే ఒక ప్రాంతం ఉందని, విస్తృత వనరులతో ఉన్న ఆ ప్రాంతం కచ్చతీవు కంటే 80 రెట్లు పెద్దదని పేర్కొన్నారు. 1976 ఒప్పందం ప్రకారం అది ఇండియాకు దక్కిందని దేవానంద వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version