కొలువుదీరిన కర్ణాటక కేబినెట్.. 24 మంది మంత్రుల ప్రమాణం

-

ఎన్నో అవాంతరాలు.. మరెన్నో అభ్యంతరాల మధ్య ఎట్టకేలకు కర్ణాటక కేబినెట్ కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వంలో పూర్తిస్థాయి మంత్రివర్గం ఇవాళ కొలువుదీరింది. బెంగళూరులోని రాజ్​భవన్​లో గవర్నర్​ థావర్​చంద్​ గహ్లోత్​ కొత్తగా ఎన్నికైన 24 మంది శాసనసభ్యులతో మంత్రులుగా ప్రమాణం చేయించారు. తాజా మంత్రివర్గ విస్తరణతో సీఎం, డిప్యూటీ సీఎంలతో కలుపుకొని కేబినట్​లో మొత్తం మంత్రుల సంఖ్య 34కు చేరింది.

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు హెచ్‌కే పాటిల్, కృష్ణ బైరేగౌడ, ఎన్.చెలువరాయస్వామి, కే.వెంకటేశ్​, హెచ్‌సీ మహదేవప్ప, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ ఖండ్రే, రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు దినేశ్​ గుండురావు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరితో పాటు క్యాతసాండ్ర ఎన్​.రాజన్న, శరణబసప్ప దర్శనాపుర్, శివానంద్ పాటిల్, రామప్ప బాలప్ప తిమ్మాపుర్, ఎస్.ఎస్.మల్లికార్జున్, శివరాజ్ సంగప్ప తంగడగి, శరణప్రకాష్ రుద్రప్ప పాటిల్, లక్ష్మీ హెబ్బాల్కర్, రహీం ఖాన్, డీ.సుధాకర్, సురేశ్ లడ్జులు, సంతోష్​​, బీ.ఎస్​.మధు బంగారప్ప, ఎమ్​.సీ. సుధాకర్, బీ.నాగేంద్ర, లక్ష్మీ హెబ్బాల్కర్, మంకుల్ వైద్య, ఎమ్‌.సీ.సుధాకర్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version