‘40% కమీషన్‌ స్కామ్’పై న్యాయ విచారణ.. కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం

-

కర్ణాటకలో ఇటీవల కొలువుదీరిన కాంగ్రెస్‌ సర్కార్ తన నిర్ణయాలతో ఇటు ప్రజలను ఆశ్చర్యపరుస్తూ.. అటు ప్రతిపక్షాలకు షాక్ ఇస్తోంది. తాజాగా సిద్ధరామయ్య ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మునుపటి బీజేపీ ప్రభుత్వ హయాంలో ‘40శాతం కమీషన్‌’  పేరుతో వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయించాలనే యోచన చేసింది. ఈ క్రమంలోనే దీనిపై న్యాయ విచారణకు  ఆదేశించింది.

ఇందుకోసం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ నాగమోహన్‌ దాస్‌ నేతృత్వంలో కమిషన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు సిద్ధరామయ్య సర్కార్ ప్రకటించింది. భారీ స్థాయిలో పనులు జరిపిన విభాగాలను పరిశీలించి.. అందుకు సంబంధించిన కార్యకలాపాలపై ఈ కమిషన్‌ దర్యాప్తు చేయనున్నట్లు తెలిపింది. పనులు ప్రారంభం కాకముందే ప్రజా ప్రతినిధులకు 25 నుంచి 30శాతం కమీషన్‌ ఇవ్వాలని.. మిగతా మొత్తం పనులు పూర్తైన తర్వాత ఇవ్వాలనే ఆరోపణలు వచ్చిన విషం తెలిసిందే. ఇంతటి తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పటికీ ప్రభుత్వ స్థాయిలో ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. పాలనలో పారదర్శకత తేవాలనే కొత్త ప్రభుత్వం కోరుకుంటోందని తాజా ఆదేశాల్లో కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version