సీఎం కేసీఆర్ మరో గంటలో ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలు దేరి వెళ్లనున్నారు. మూడు రోజులపాటు అక్కడే ఉండనున్న ఆయన ప్రధాని మోడీని కలుస్తారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. సీఎంవో కోరడంతో ప్రధాని అపాయింట్‌మెంట్ కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా పంటి సమస్యతో బాధపడుతున్న కేసీఆర్ అక్కడ డెంటిస్టును కలుస్తారని అంటున్నారు. అధికారిక పర్యటన కాదని, కేవలం చికిత్స కోసమే ఆయన వెలుతున్నారని అంటున్నారు.
ఇక కేంద్ర మంత్రులను కూడా కేసీఆర్ కలిసి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై నివేదికలు సమర్పించనున్నారని అంటున్నారు. ఇక ఢిల్లీలో టీఆర్‌ఎస్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారని సమాచారం. కేసీఆర్ వెంట మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్, సీఎస్ సోమేశ్‌కుమార్ కూడా ఢిల్లీ వెళ్తున్నారని అంటున్నారు. పలువురు రైతు సంఘాల నేతలతోనూ సీఎం భేటీ అవుతారని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.