శబరి యాత్రకు వెళ్తున్నారా.. ఇవి తెలుసుకోండి !

-

ప్రతి ఏడాది అయ్యప్ప భక్తులు ఎంతో భక్తి శ్రద్దలతో శబరి యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా ఆ యాత్రని పరిమిత సంఖ్యలోనే భక్తులని అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఈ విషయం మీద కేరళ ప్రభుత్వం కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. నిజానికి దేవస్థానం కేరళలో ఉన్నా అక్కడి భక్తుల కంటే తెలుగు రాష్ట్రాల భక్తులే అక్కడ ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. దీంతో ఇక్కడి ప్రభుత్వాలకి కూడా తీసుకున్న నిర్ణయాల్ని తెలియచేసింది అక్కడి ప్రభుత్వం ఈ మేరకు తెలంగాణా సీఎస్ కు కేరళ సీఎస్ లేఖ రాశారు.

శబరిమల ఆలయంలో ఈ ఏడాది నెయ్యి అభిషేకం, అలానే పంపా నదిలో స్నానాలకు అనుమతి లేదని కేరళ సిఎస్ రాసిన లేఖలో పేర్కొన్నారు. అంతేకాక వచ్చే భక్తులు అందరూ వర్చువల్‌ క్యూ పోర్టల్‌ ద్వారా దర్శనం కోసం నమోదు చేయించుకోవడం తప్పని సరని లేఖలో పేర్కొన్నారు. ఇక వర్చువల్‌ క్యూ https://sabarimalaonline.org ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంది. అలానే మామూలు రోజుల్లో వెయ్యి మంది, వారాంతంలో రెండు వేల మంది భక్తులకు మాత్రమే అనుమతినిస్తామని లేఖ ద్వారా తెలిపారు. అలానే దర్శనానికి 48 గంటల ముందు చేయించిన కొవిడ్‌ నెగటివ్‌ సర్టిఫికేట్ తప్పనిసరి అని పేర్కొన్నారు. అలానే పదేళ్ల లోపు, 60 ఏళ్లకు పైబడిన వారికి దర్శనానికి అనుమతి లేదని కూడా పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version