తూర్పు లడఖ్ లోని వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులు మెరుగుపడ్డాయని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. నిరంతర దౌత్య చర్చల ఫలితంగా భారత్- చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొంత మెరుగుపడుతున్నాయని చెప్పారు. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంపై లోక్ సభలో
జైశంకర్ మాట్లాడారు. “చైనా చర్యల ఫలితంగా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతకు భంగం కలిగింది. 2020 నుంచి భారత్-చైనా సంబంధాలు అసాధారణంగా ఉన్నాయి. అప్పటి నుండి మా నిరంతర దౌత్య చర్చల వల్ల సంబంధాలు మెరుగుపరిచే దిశలో ఉంచాయి.” అని ఆయన అన్నారు.
సరిహద్దు పరిష్కారం కోసం న్యాయమైన, పరస్పరం ఆమోదయోగ్యమైన పరిస్థితులతో కోసం చైనాతో పరస్పర చర్చకు భారత్ కట్టుబడి ఉందని జై శంకర్ పునరుద్ఘాటించారు. 2020 గల్వాన్ వ్యాలీ ఘర్షణ తర్వాత ఎల్పీసీ వెంబడి ప్రతిష్టంభన నెలకొంది. ఆ తర్వాత చర్చల తర్వాత ఎల్సీ వెంబడి పెట్రోలింగ్ ను తిరిగి ప్రారంభించిన రెండు నెలల తర్వాత జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.