పార్లమెంట్ సభ్యులు, మాజీ సభ్యులకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ శుభవార్త చెప్పింది. పార్లమెంట్ మెంబర్స్, మాజీ సభ్యుల జీతభత్యాలు పెంచబోతున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. పెన్షన్ పెంపు 2023 ఏప్రిల్ 1 నుండి అమలులోకి తీసుకు వస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఇప్పటివరకు ఉన్న జీతాలను లక్ష నుండి 1.24 లక్షలకు పెంచింది.
అలాగే డైలీ అలవెన్సెస్ లను 2000 నుండి 2500 వరకు పెంచింది. ఇక పెన్షన్లను 25 వేల నుండి 31 వేల వరకు పెంచింది. అలాగే మాజీ సభ్యులకు ప్రతి సంవత్సరం సర్వీస్ కి అదనపు పెన్షన్ 2500 చేసింది. ద్రవయోల్బన రేటు { వ్యయ ద్రవయోల్బన సూచిక} ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ పెరుగుదలను చేసింది. పార్లమెంట్ సభ్యుల జీతభత్యాలు, పెన్షన్ చట్టం 1954 ద్వారా మంజూరు చేసిన అధికారాల ద్వారా ఈ చర్య తీసుకున్నారు.
ఆదాయపు పన్ను చట్టం 1961 లోని వ్యయ ద్రవణ సూచికపై జీతభత్యాల పెంపు ఆధారపడి ఉంది. ఇక ఈ సవరణను లోక్సభ సెక్రటేరియట్ ఆమోదించడంతో తక్షణమే అమలులోకి రానుంది. ఎంపీల జీతభత్యాలు, పెన్షన్లు పెంచి చాలా కాలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో ఎంపీలకు భారీగా ప్రయోజనం చేకూరబోతోంది.