ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో జపాన్ పర్యటనకు వెళ్లానున్నారు. వచ్చే నెలలో సీఎం రేవంత్ రెడ్డి వారం రోజులపాటు జపాన్ లో పర్యటించనున్నారు. ఒసాకా లో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్ పోలో ఆయన పాల్గొంటారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కలిసి కోరనున్నారు రేవంత్ రెడ్డి.
ఈ పర్యటన కోసం సీఎం రేవంత్ రెడ్డి తో పాటు జపాన్ కి మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు వెళ్ళనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ని ఇప్పటికే అధికారులు ఖరారు చేశారు. జపాన్ లోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారిత అభివృద్ధితోపాటు తెలంగాణకు పెట్టుబడులు తీసుకువచ్చేందుకే ఈ పర్యటనకు వెళుతున్నారు.
అలాగే తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన సందర్భంగా జపాన్ సాంకేతిక అభివృద్ధిని అధ్యయనం చేయడంతో పాటు.. స్కిల్ యూనివర్సిటీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా వారిని కోరే అవకాశం ఉంది. వచ్చేనెల 15 నుండి 23 వరకు ఈ జపాన్ పర్యటన సాగనుంది.