నేడు దిల్లీకి లక్షల మంది రైతులు.. రామ్​లీలా మైదానంలో ‘కిసాన్‌ మహా పంచాయత్‌ ‘

-

రైతుల ఆందోళనలతో దేశ రాజధాని దిల్లీ మరోసారి అట్టుడుకనుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి ఇవాళ లక్షల మంది రైతులు హస్తిన చేరుకోనున్నారు. దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఈరోజు ‘కిసాన్‌ మహా పంచాయత్‌’ నిర్వహించనున్నట్లు సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) నేతలు వెల్లడించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న ప్రధాన డిమాండుతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పలు రైతు సంఘాల సమాఖ్యగా ఏర్పడిన ఎస్‌కేఎం ఇప్పటికే ప్రకటించింది.

 

“2021 డిసెంబర్‌ 9న కేంద్ర ప్రభుత్వం మాకు లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలి. అలాగే రైతులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యల పరిష్కారానికి సమర్థ చర్యలు తీసుకోవాలి’’ అని కిసాన్‌ మోర్చా నేత దర్శన్‌ పాల్‌ తెలిపారు.

దిల్లీకి లక్షల మంది రైతులు తరలిరానున్న నేపథ్యంలో అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు. గతంలో హస్తినలో జరిగిన అన్నదాతల ఆందోళన కార్యక్రమంలో చాలా మంది రైతులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా దిల్లీ పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా రామ్​లీలా మైదానం వద్ద భారీ బందోబస్తు ఉంచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version