మెడికో హత్యాచార కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీం

-

కోల్​కతాలో జూనియర్ డాక్టర్​పై జరిగిన హత్యాచార ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. సీజేఐ  జస్టిస్​ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్​ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఆగస్టు 20వ తేదీన ఈ కేసును విచారించనుంది. ఈనెల 9న కోల్‌కతాలోని ఆర్జీ కార్‌ ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్‌పై అత్యాచారం ఆపై హత్య జరిగిన విషయం తెలిసిందే. ప్రాణాలు కాపాడే వైద్యురాలిపై ఇలాంటి అఘాయిత్యం జరగడం, అది కూడా ఆస్పత్రిలో జరగడంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన కేసును సుమోటోగా స్వీకరించాలని కోరుతూ ఇద్దరు న్యాయవాదులు భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ క్రమంలోనే కేసు విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం వెబ్‌సైట్‌లో పేర్కొంది. మరోవైపు ఈ కేసును కలకత్తా హైకోర్టు ఇప్పటికే సీబీఐకి బదిలీ చేశారు.  దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు.. విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే  ప్రధాన నిందితుడికి మానసిక సామర్థ్య పరీక్షలు నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version