ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ వద్ద మహా కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజుల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈనెల 26 మహాశివరాత్రి వరకు కుంభమేళా కొనసాగుతోంది. కుంభమేళా సందర్భంగా న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించారు. అయితే వీరి మరణానికి రైల్వే శాఖదే తప్పిదమంటూ కుంభమేళా పై RJD చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
కుంభమేళా వేస్ట్.. అని ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరగడం చాలా బాధకరమన్నారు. ఈ ఘటన కు బాధ్యత వహిస్తూ రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అసలు కుంభమేళాకు అర్థమే లేదు. ఇది పనికి రానిది అని లాలూ ప్రసాద్ పేర్కొనడం పై విమర్శలు వినిపిస్తున్నాయి. హిందువుల మనోభావాలను అవమానించిన లాలూ ప్రసాద్ యాదవ్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.