రాహుల్‌ గాంధీపై లలిత్‌ మోదీ ఫైర్.. దావా వేస్తానంటూ వార్నింగ్

-

మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలు ఎదుర్కోవడమే కాకుండా లోక్​సభ సభ్యతాన్ని కోల్పోయారు రాహుల్ గాంధీ. తాజాగా రాహుల్​పై ఐపీఎల్‌ సృష్టికర్త, మాజీ ఛైర్మన్‌ లలిత్‌ మోదీ తీవ్రంగా మండిపడ్డారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నందుకు పరువునష్టం దావా వేస్తానని రాహుల్​కు వార్నింగ్ ఇచ్చారు.

‘‘’నేను న్యాయప్రక్రియ నుంచి పారిపోయానని గాంధీ మద్దతుదారులు, ప్రతి ఒక్కరూ ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకు? ఎలా? రాహుల్‌ గాంధీ మాదిరిగా.. ఇప్పటివరకు నేను ఏ కేసులోనైనా దోషిగా తేలానా? ప్రతిపక్ష నేతలు ఏమీ చేయలేక.. ఇలా అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని ఇప్పుడు సామాన్య పౌరుడు కూడా అర్థం చేసుకోగలడు. ఈ తప్పుడు ఆరోపణలకు గానూ రాహుల్‌కు వ్యతిరేకంగా నేను యూకే కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నా. ‘గత 15 ఏళ్లలోనే నేను ఒక్క రూపాయి కూడా అక్రమంగా దోచుకున్నట్లు ఇప్పటివరకు నిరూపణ కాలేదు. 1950 నుంచి కాంగ్రెస్‌ ఈ దేశం కోసం చేసిన దానికంటే ఎక్కువగా, వారి ఊహలకు మించి ‘మోదీ’ కుటుంబం (ఆ కమ్యూనిటీని ఉద్దేశిస్తూ) ఈ దేశానికి సేవ చేసింది. నేను దోచుకున్నానని మీరు ఎంత అరిచినా లాభం లేదు. ఇక భారత్‌లో కఠినమైన చట్టాలను తీసుకొచ్చిన తర్వాత నేను తప్పకుండా తిరిగొస్తాను’’’ అని లలిత్ మోదీ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version