నేడూ కొనసాగనున్న లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం

-

18వ లోక్‌సభ తొలి సమావేశాలు ఇవాళ రెండో రోజు కొనసాగనున్నాయి. ఉదయం 11 గంటలకు తిరిగి ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. మరోవైపు సోమవారం రోజున ప్రారంభమైన ఈ సమావేశాల్లో ప్రొటెం స్పీకర్‌గా ఎన్నికైన భర్తృహరి మహతాబ్‌ కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రమాణం చేయించారు. సభ ప్రారంభం కాగానే ప్రొటెమ్‌ స్పీకర్‌  తొలుత ప్రధాని నరేంద్ర మోదీతో ప్రమాణం చేయించిన తర్వాత సీనియర్‌ నేతలైన  రాధామోహన్‌సింగ్‌, ఫగ్గన్‌సింగ్‌ కులస్తేలతో ముందుగా ప్రమాణం చేయించారు.

తర్వాత కేంద్ర కేబినేట్‌ మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌షా, నితిన్‌ గడ్కరీ, శివరాజ్‌సింగ్‌చౌహాన్‌, మనోహర్‌లాల్‌ కట్టర్‌, తర్వాత కేంద్ర సహాయ మంత్రులు, మిగిలిన నేతలు 18వ లోక్‌సభ సభ్యులుగా ప్రమాణం చేశారు. ఇంగ్లీష్, సంస్కృతం, హిందీ, డోగ్రీ, బెంగాలీ, అస్సామీ, ఒడియా, కన్నడ, తెలుగు, మరాఠీ ఇలా భారతీయ భాషలలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయడంతో లోక్‌సభ భాషా వైవిధ్యాన్ని ప్రదర్శించింది. 262 మంది ఎంపీలు తొలిరోజు ప్రమాణ స్వీకారం చేయగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సహా మిగిలిన సభ్యులు ఈరోజు ప్రమాణం చేయనున్నారు. జూన్ 26వ తేదీన లోక్‌సభ స్పీకర్‌ను ఎన్నుకుంటారు. కొత్త స్పీకర్‌ను ఎన్నుకునే వరకు ప్రొటెం స్పీకర్ లోక్‌సభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version