తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపధ్యంలో పోలీస్ శాఖ మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది. అసెంబ్లీ పరిసరాల పై పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలకు అనుమతి లేదని ప్రకటన చేసింది పోలీసు శాఖ. అటు అసెంబ్లీ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ అంక్షలు విధింపు విధించారు.
అసెంబ్లీ భద్రత విధుల్లో ముగ్గు రు డీసీపీలు, 7గురు ఏసీపీలు, 18 మంది సీఐలు, 25 మంది ఏఎస్సైలు, 220మంది కానిస్టేబుళ్లు ఉంటున్నారు. కమాండ్ కంట్రోల్ నుంచి అనుక్షణం పర్యవేక్షణ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా… తెలం గాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఖరారు అయింది. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఇవాళ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఈ నెల 19వ తేదీన బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.