స్వాతి మలివాల్‌ ముఖంపై అంతర్గత గాయాలు.. వైద్య పరీక్షల్లో వెల్లడి

-

ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి నేపథ్యంలో ఆప్‌ ఎంపీకి శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. దిల్లీలోని ఎయిమ్స్‌లో దాదాపు మూడు గంటల పాటు వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. ఈ పరీక్షల్లో ఆమె ముఖంపై అంతర్గత గాయాలైనట్లు తేలింది.

మరోవైపు దాడి ఘటనపై స్వాతి మలివాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బిభవ్‌ను నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు.  స్వాతి మలివాల్‌ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఈ వాంగ్మూలంలో స్వాతి సంచలన ఆరోపణలు చేసినట్లు సమాచారం. బిభవ్‌ కుమార్‌ తనపై భౌతిక దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడని, కాలితో తన్ని, కర్నతో బాదినట్లు వాంగ్మూలంలో తెలిపారు. మరోవైపు ఈ ఘటనను జాతీయ మహిళా కమిషన్‌ సైతం సుమోటోగా తీసుకుంది. బిభవ్‌ కుమార్‌కు గురువారం సమన్లు జారీ చేసింది. శుక్రవారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version