కేదార్​నాథ్​లో దారుణం.. గుర్రాలకు సిగరెట్ తాగిస్తూ.. కర్రలతో కొడుతూ

-

పవిత్ర కేదార్​నాథ్​లో ఎత్తైన పర్వతాలను ఎక్కుతూ.. మనుషుల్ని, వస్తువుల్ని తరలించే గుర్రాలు, గాడిదలను హింసకు గురవుతున్నారు. కొంత మంది యజమానులు ఈ జంతువులతో క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. వీటికి బలవంతంగా ధూమపానం చేపిస్తూ.. కర్రలతో కొడుతూ.. తీవ్రంగా గాయపడ్డ వాటితో కూడా పనిచేయిస్తూ అత్యంత కిరాతకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి గుర్రానికి ధూమపానం తాగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్​ అయింది. దీనిపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఈ వీడియో వైరల్ అవ్వడంతో జంతుసంరక్షణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై పీపుల్ ఫర్​ యానిమల్​ సంస్థ ప్రతినిధి గౌరీ మౌలేఖీ స్పందించారు. ‘గతేడాది కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు ఇదే జరుగుతోంది. జంతువుల మృతదేహాలను నదుల్లో విసిరేస్తున్నారు. బలహీనమైన జంతువులతో పని చేయిస్తున్నారు. జంతువులు అలసిపోయినా.. వాటికి మత్తు ఇచ్చి ఉపయోగిస్తున్నారు. అవి చనిపోయేలా హింసిస్తున్నారు. ఇదంతా చూస్తూ వ్యవస్థ నిద్రపోతోంది’ అని గౌరీ మౌలేఖీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సంబంధిత మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version