దేశంలోని రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది మోడీ ప్రభుత్వం. ఒక్కో రైతుకు ఏడాదికి పదివేల చొప్పున పీఎం కిసాన్ నిధులను ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే… రైతులకు అదిరిపోయే శుభవార్త అందించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. వ్యవసాయంపై నిన్న కేంద్ర క్యాబినెట్ లో చర్చించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే పీఎం కిసాన్ పెట్టుబడి సహాయాన్ని ప్రభుత్వం కొంతమేరకు పెంచినట్లుగా ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే క్యాబినెట్ లో దీనిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్ సమావేశాల నాటికి సాయం పెంపుపైన క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద మూడు విడతల్లో ఏటా రూ. 6 వేలు ఇస్తుండగా, దీనిని రూ. 10 వేలకు పెంచాలనే డిమాండ్లు వస్తున్నాయి.