గ్రామీ అవార్డుకు నామినేటైన ప్రధాని మోదీ పాట!

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సాహిత్యం అందించిన ఓ పాట గ్రామీ పురస్కారానికి ఎంపికైంది. ప్రపంచవ్యాప్తంగా 2023 ఏడాదిని తృణధాన్యాల సంవత్సరం జరుపుకుంటున్న నేపథ్యంలో.. తృణధాన్యాల ప్రాధాన్యత, లాభాలను వివరిస్తూ రూపొందించిన ‘అబండెన్స్‌ ఇన్‌ మిల్లెట్స్‌’ పాటను మోదీ గత జూన్​లో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పాటను ఇండో-అమెరికన్‌ గాయని ఫాల్గుణి షా(ఫాలూ) ఆమె భర్త గౌరవ్‌ షా కలిసి రూపొందించారు.

ఈ సాంగ్​కు సాహిత్యంలో ప్రధాని సహకారం అందించారు. ఈ పాట హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో విడుదల చేయగా.. ఈ పాటకు సంగీత రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డు బెస్ట్‌ గ్లోబల్‌ మ్యూజిక్‌ పర్‌ఫామెన్స్‌ కేటగిరీలో నామినేట్‌ అయింది. ఈ సాంగ్​ను రూపొందించిన ఫాల్గుణి షా 2022లో గ్రామీ అవార్డు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రధాని మోదీని కలిశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆకలి నిర్మూలన కోసం ఒక పాట రాయాలని ఫాల్గుణి షా దంపతులకు మోదీ సూచించడంతో.. ఆయన్ను కూడా పాటలో భాగమవ్వాలని ఫాల్గుని, గౌరవ్ షా కోరగా మోదీ సానుకూలంగా స్పందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version