ఐపీఎల్ 2023 సీజన్ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. అయితే, తాజాగా ఐపీఎల్ 2023 సీజన్ లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ రాయల్స్ తో ఆదివారం జరిగిన 1000వ ఐపిఎల్ మ్యాచ్లో 6 వికెట్లు తేడాతో గెలుపొందింది.
చివరి ఓవర్ లో ముంబై విజయానికి 17 పరుగులు అవసరం అవ్వగా, తొలి మూడు బంతుల్లోనే టీమ్ డేవిడ్ హ్యాట్రిక్ సిక్సులుగా మలిచి చిరస్మరణీయ విజయం అందించారు. ఈ గెలుపుతో యశస్వి జైస్వాల్ శతకం వృధా అయ్యింది.
ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 212 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో చెలరేగాడు. మిగతా బ్యాటర్లు విఫలమైన విద్వాంసకర బ్యాటింగ్ తో జట్టుకు భారీ స్కోర్ అందించారు. ముంబై బౌలర్లలో అర్షద్ ఖాన్ 3, పియూష్ చావ్లా 2 వికెట్లు తీయగా… జోఫ్రా ఆర్చర్, రిలే మెరిడిత్ తలో వికెట్ తీశారు.