BREAKING : ముంబయికి ఉగ్రదాడి బెదిరింపులు.. పాక్‌ నుంచి మెసేజ్

-

దేశ ఆర్థిక రాజధాని ముంబయిపై ఉగ్ర దాడులు చేస్తామని బెదిరింపు సందేశం వచ్చింది. ఈ మేరకు ముంబయి పోలీస్​ ట్రాఫిక్​ కంట్రోల్​ రూంకు ఒక మెసేజ్​ వచ్చినట్లు వారు వెల్లడించారు.

26/11 ఉగ్రదాడి తరహాలో విరుచుకుపడతామని, మొత్తం ఆరుగురు భారత్​లో ఈ ప్రణాళికలో భాగం అయ్యారని అందులో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ సందేశం పాకిస్థాన్​ నుంచి వచ్చినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version