బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలోనే…ఆ రాష్ట్రంలో మత రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. బీజేపీ పార్టీ హిందువులకు న్యాయం జరిగేలా చూస్తుంటే.. ఇతర పార్టీలు మాత్రం.. ముస్లింలకు కొమ్ముకాస్తున్నాయి. ముఖ్యంగా ముస్లిం మైనారిటీల ఓటు బ్యాంకు విషయంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, రాష్ట్రీయ జనతాదళ్ అనుసరిస్తున్న రాజకీయ వ్యవహాలు, దేశ ఐక్యతకే ముప్పులా పరిణమించాయనే ఆందోళనలు సర్వత్ర వెళ్లడవుతున్నాయి.
బీహార్ సీమాంచల్ రీజియన్ లో ఓటు బ్యాంకును పెంచుకోవడానికి ముస్లింల బుజ్జగింపు రాజకీయాలకు ఆర్జెడి తెర తీసినట్టుగా తెలుస్తోంది. కిషన్ గంజ్, అరారియా, కతిహార్, పూర్ణియా వంటి జిల్లాలు సీమాంచల్ రీజియన్ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ ముస్లింల జనాభా అధికంగా ఉంది. బంగ్లాదేశ్ నుంచి చోటు చేసుకుంటున్న అక్రమ చొరబాట్ల వల్ల సీమాంచల్ రీజియన్ లో ముస్లిం జనాభా గణనీయంగా పెరుగుతోంది. వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆర్జేడి బుజ్జగింపు రాజకీయాలకు దిగడం వల్ల సామాజిక, రాజకీయ స్థిరత్వానికి ముప్పు కలుగుతుందని అంటున్నారు. అంతేకాదు…. జాతీయ ఐక్యత గురించి ఆందోళనలు మరింత పెంచుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సీమాంచల్ రీజియన్ పరిధిలోని జిల్లాల్లో ఇప్పుడు ముస్లింలు 40 నుంచి 70 శాతం వరకు జనాభా ఉంటున్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం చూసుకుంటే అగ్రస్థానంలో ఉంది కిషన్ గంజ్ జిల్లా మాత్రమే. ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్న ప్రాంతం ఆర్జేడి కావడం వల్ల కాంగ్రెస్, ఏఐఎంఐఎం ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నాయి. ముస్లింలు మెజారిటీ సంఖ్యలో ఉండే నియోజకవర్గాలపై అధికంగా దృష్టిని ఆర్జేడి, కాంగ్రెస్, ఏఐఎంఐఎం సారిస్తున్నాయని చెబుతున్నారు.
లాలు ప్రసాద్ యాదవ్ సతీమణి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి తన నివాసంలో ఇస్లామిక్ ఆచారాలను పాటిస్తుండడం…. ఆ సామాజిక వర్గంతో ఆ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని మరింతగా తెలియజేస్తుందని విమర్శకులు వాదిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు విభజనను పెంచుతాయి. దేశ విభజన, బంగ్లాదేశ్ విముక్తి యుద్ధ సమయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. ఆ టైంలో బీహార్ ముస్లిం జనాభా వివాదాస్పద పాత్రలు పోషించినట్లు చారిత్రక సూచనలు చేయడం జరుగుతోంది. సింధ్ అసెంబ్లీ సభ్యుడు ఇటీవల చేసిన వాక్యాలు ఈ వాదనలను బలపరిచాయి. పాకిస్తాన్ ఆవిర్భవించడానికి బీహార్ ముస్లింలు కృషి చేశారంటూ తేల్చి చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది.