నా పోరాటం కొనసాగుతుంది : ఎమ్మెల్సీ కవిత

-

తనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై ఎమ్మెల్సీ కవిత న్యాయం గెలిచిందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుమారు 150 రోజులకు పైగా తిహార్ జైలులో ఉన్న కవితకు మంగళవారం సుప్రీం కోర్టు షరతులతో కూడా బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.అంతకుముందు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు సైతం కవితకు బెయిల్ ఇవ్వరాదని ఎటువంటి అబ్జెక్షన్ చెప్పకపోవడంతో ఎట్టకేలకు సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది.

Supreme Court granted bail to MLC Kavitha in both ED and CBI cases in Delhi liquor case

ఈ క్రమంలో బుధవారం ఉదయం రౌస్ అవెన్యూలో కోర్టుకు హాజరైన కవిత.. ఫార్మాలిటిస్ పూర్తి చేసుకుని ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. మధ్యాహ్నం ఫ్లైట్‌కు ఆమె ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ ఎయిర్ పోర్టు వద్ద గల మీడియాతో కవిత మాట్లాడుతూ.. ఎప్పటికైనా న్యాయం, నిజమే గెలుస్తుంది. నా పోరాటం కొనసాగుతుంది. జై తెలంగాణ’ అని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో కవిత వెంట భర్త అనిల్, సోదరుడు కేటీఆర్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version