సాధారణ గల్లీ లీడర్, లేదా చిన్న హీరో వంటి వారు బయటకు వెళ్తే చుట్టూ మనుషులు కొన్నిసార్లు బాడీగార్డ్స్ను కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ భారత్లోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఫౌండర్ ఒకరు, బ్రిటన్ ఫస్ట్ లేడీ ఇంకొకరు. ఈ ఇద్దరు తండ్రీ కూతుళ్లు. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈ ఇద్దరు ఎలాంటి ఎస్కార్ట్ లేకుండా సాధారణ పౌరుల్లో బెంగళూరులోని ఓ ఐస్క్రీమ్ పార్లర్లో మిగతా కస్టమర్లతో పాటుగా ఐస్క్రీమ్ ఎంజాయ్ చేశారు. వారు నార్మల్ కస్టమర్లలాగే ఉండటంతో ఎవరూ గుర్తుపట్టలేదు. ఇంతకీ వాళ్లెవరంటే?
భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, ఆయన కుమార్తె, బ్రిటన్ ఫస్ట్ లేడీ అక్షత మూర్తి బెంగళూరు జయనగరలోని కార్నర్ హౌస్ ఐస్ క్రీమ్స్ షాప్లో సాధారణ వినియోగదారులుగా ఓ టేబుల్ వద్ద కూర్చొని ఐస్క్రీమ్ తింటున్నారు. అక్కడకు వచ్చిన దేవి సింగ్ అనే వ్యక్తి వారిద్దరినీ చూసి కాసేపు అవాక్కయ్యాడు. ఓ మూలన కూర్చుని ఐస్‌క్రీమ్ తింటున్న వారిద్దరూ సాధారణ వ్యక్తులు కాదని అతను మాత్రమే గుర్తించాడు. వారిని చూసిన సింగ్.. ఫొటో తీస్తున్నా ఏమాత్రం అభ్యంతరం పెట్టకుండా తండ్రీ కూతుళ్లు అలా చూస్తుండిపోయారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వారు ఎంతో ధనికులు.. వీరి జీవితం మాత్రం ఎంతో నిరాడంబరమంటూ సదరు నెటిజన్ తన ఎక్స్‌లో వీరిద్దరి చిత్రాన్ని పోస్ట్ చేశారు.