New rule in cricket : కొద్దిరోజుల క్రితమే ఐసీ సీ టి20 లు మరియు వన్డేలలో ఒక సరి కొత్త నిబంధనను తీసుకువచ్చింది. ఇది ఈ డిసెంబర్ 12 అంటే ఇవాళ్టి నుంచి అమలు కాబోతుంది. టి 20 సిరీస్ లో భాగంగా ఈరోజు నుంచి ఇంగ్లాండు వెస్టిండీస్ తో తలపడనుంది. అంటే నేటి నుంచి ఈ స్టాప్ క్లాక్ అనే నూతన నిబంధనను పరిమిత క్రికెట్లో ఎక్కువ సమయాన్ని వృధా చేస్తున్నందువలన దీన్ని తీసుకు వస్తున్నట్టు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తెల్పింది.
ఈ నిబంధన ప్రకారం బౌలింగ్ చేసే జట్టు లాస్ట్ ఓవర్ చివరి బంతి నుంచి మరుసటి ఓవర్ తొలి బంతికి మధ్య గల సమయాన్ని ఒక్క నిమిషం కంటే ఎక్కువగా తీసుకోకూడదు. ఒకవేళ అలా చేస్తే రెండుసార్లు వార్నింగులు ఎంపైర్లు ఇస్తారు. అలా మూడోసారి కూడా జరిగినట్లయితే అంపైర్స్ బ్యాటింగ్ చేస్తున్న టీమ్ కు 5 పరుగులు ఎక్స్ట్రా ఇస్తారు. అయితే ఈ కొత్త నిబంధన వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ప్రయోగాత్మకంగా అమలులో ఉంటుందని గత నెల నవంబర్ 21న అహ్మదాబాద్ లో బోర్డు సమావేశం జరిగిన సందర్భంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది.