పహల్గామ్ ఉగ్రదాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఉగ్రదాడి కేసు విచారణ బాధ్యతలు NIAకి అప్పగించారు. దింతో పహల్గామ్ ఉగ్రదాడి కేసులో రంగంలోకి దిగింది NIA. ఏప్రిల్ 23 నుంచి ఈ ఘటనకు సంబంధించి NIA ఆరా తీస్తున్నట్టు సమాచారం అందుతోంది.

కాగా, పాకిస్థాన్ టెర్రరిస్ట్ లకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. లష్కరే తోయిబా టెర్రరిస్ట్ ఫరూక్ అహ్మద్ ఇంటిని పేల్చేసింది ఇండియన్ ఆర్మీ. పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధం ఉన్న టెర్రరిస్టుల ఏరివేతను ముమ్మరం చేసింది ఇండియన్ ఆర్మీ. నార్త్ కశ్మీర్‌లో ఉన్న లష్కరే తోయిబా టెర్రరిస్ట్ ఫరూక్ అహ్మద్ ఇంటిని బ్లాస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.