చలో వరంగల్ నేపథ్యంలో.. బీఆర్ఎస్ శ్రేణుల పాదయాత్ర కొనసాగుతోంది. ములుగు జిల్లా వెంకటాపూర్(రామప్ప) మండలం నుంచి బీఆర్ఎస్ శ్రేణుల పాదయాత్ర కొనసాగుతోంది. నేడు వరంగల్-ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పాదయాత్రగా తరలివస్తున్నారు శ్రేణులు.

కాగా, ఇవాళ గులాబీ పార్టీ 25వ వార్షికోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో రజతోత్సవం పేరుతో.. భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది గులాబీ పార్టీ. ఇందులో భాగంగానే… ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బయటకు రాని కెసిఆర్ కూడా… ఈ సభతో రంగంలోకి దిగబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో వచ్చినప్పటికీ.. ఆ తర్వాత మళ్లీ సైలెంట్ అయ్యారు కెసిఆర్.