గూగుల్‌ మ్యాప్స్‌కు ఓలా గుడ్ బై.. ఇకపై సొంతంగా నావిగేషన్!

-

ప్రముఖ రెండెంట్ వెహికిల్ కంపెనీ ఓలా కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ గూగుల్ మ్యాప్స్ను వినియోగించి నావిగేట్ చేసిన ఈ కంపెనీ తాజాగా గూగుల్ మ్యాప్స్ నుంచి నిష్క్రమించింది. ఇప్పటి వరకు ఓలా తమ క్యాబ్‌/ ఆటో/ బైక్‌ సర్వీసుల కోసం గూగుల్ మ్యాప్స్ వినియోగిస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. అయితే ఇకపై తాము సొంతంగా సిద్ధం చేసుకున్న ఓలా మ్యాప్స్‌ను ఉపయోగించనున్నట్లు ఓలా కంపెనీ సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. యూజర్లు ఓలా యాప్‌ను అప్‌డేట్‌ చేసుకుని, తాజా సేవలను పొందొచ్చని ఆయన తెలిపారు.

గత నెలలో మైక్రోసాఫ్ట్‌ అజూర్‌ నుంచి వైదొలగిన తాము ఇపుడు గూగుల్‌ మ్యాప్స్‌ నుంచీ నిష్క్రమించామని వెల్లడించారు. ఏటా రూ.100 కోట్లను ఇందుకు ఖర్చు పెట్టేవాళ్లమని.. ఇపుడు తమ సొంత మ్యాప్స్‌ వాడతామని తెలిపారు. కనుక తమ ఖర్చు సున్నాకు చేరుతుందని అగర్వాల్‌ పేర్కొన్నారు. స్ట్రీట్‌ వ్యూ, ఇండోర్‌ ఇమేజెస్, డ్రోన్‌ మ్యాప్స్‌, త్రీడీ మ్యాప్స్ మొదలైన ఫీచర్లను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version