జమ్ము కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్..నలుగురు ఉగ్రవాదులు హతం

-

జమ్ము కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో భద్రతా బలగాల చేతిలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో నలుగురు ఉగ్రవాదులు దాక్కున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు వీర మరణం పొందారు.

 

కుల్గాం జిల్లాలోని ఫ్రిసల్ చిన్నిగాం, మోడెర్గాం గ్రామాల్లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం ఆధారంగా, భద్రతా బలగాలు కార్డెన్‌సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు ప్రారంభం అయ్యాయి. మోర్గాంలోని ఓ ఇంటి వద్దకు వెళ్లిన సైన్యం, సీఆర్పీఎఫ్ బలగాలపై ముష్కరులు భారీస్థాయిలో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ సైనికుడు వీరమరణం పొందారు. ఫ్రిసల్‌ చిన్నిగాంలో జరిగిన మరో భారీ ఎన్‌కౌంటర్‌లో సైన్యం నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ క్రమంలో మరో సైనికుడు అమరుడయ్యారు. ఆ రెండు చోట్లా ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సైనిక అధికారులు తెలిపారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతోందని ఆర్మీ అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version