6వ భార్య అందుకు నిరాకరించిందని 7వ పెళ్లి..!

-

సుమారుగా ఐదారు రోగాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఓ 63 ఏళ్ల ప్రబుద్ధుడు ఏడవ సారి పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యాడు గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ వృద్ధుడు. తన కన్నా 20 ఏళ్లు చిన్నదైన ఆరో భార్య అతనితో శారీరక సంబంధానికి నిరాకరిస్తుందనే కోపంతో మరో పెళ్లి చేసుకుంటానని సిద్ధమయ్యాడు. గతేడాది సెప్టెంబర్‌లో ఓ వితంతువును ఆరో వివాహం చేసుకున్నాడు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆమె అతడిని దూరం పెడుతూ వచ్చింది. దీంతో కోపోద్రిక్తుడైన వృద్ధుడు డిసెంబర్‌లో ఆమెతో తెగదెంపులు చేసుకున్నాడు. తనకు డయాబెటీస్, గుండె సంబంధిత సమస్యలతో పాటు ఇతరత్రా ఆరోగ్య సమస్యలుండటంతో తన బాగోగులు చూసుకునేందుకు ఓ తోడు కావాలని, అందుకే మరో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాన్నని అతగాడు చెప్పుకొచ్చాడు.

 

పిల్లలతో మొదటి భార్య అక్కడే..

పెళ్లి విషయం తెలుసుకున్న 6వ భార్య నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అతని గుట్టు చాటున జరుగుతున్న రాస లీలలు బయటకు వచ్చాయి. ఈ నిత్య పెళ్లి కొడుకు ఎవరితో పెళ్లి చేసుకున్నా ఎక్కువ కాలం సంసారం చేయడని, డబ్బు ఆశ చూపి పెళ్లి చేసుకొని తన కోరికలు తీర్చుకొని వదిలేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేటతెల్లమైంది. కాగా ఆ ప్రబుద్ధుడు తన గత వివాహాలపై తనకు చెప్పలేదని.. పెళ్లిలో ఇస్తానన్న నగదు, ఇల్లు కూడా ఇవ్వలేదని ఆరవ భార్య ఆరోపించింది. అయితే.. అతని మొదటి భార్య 20 – 35 ఏళ్ల వయస్సు ఉన్న ఆమె తన సంతానంతో కలిసి అదే గ్రామంలో ఉంటుందన్న విషయం తెలిసి పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదిలా ఉండగా తమ ఆచార వ్యవహారాల్లో ఇలా పెళ్లిలు చేసుకోవడం ఆనవాయితి అంటు నిందితుడు వాదనకు దిగడం గమన్హరం.

Read more RELATED
Recommended to you

Exit mobile version