ఆ సైరన్ల మోత ఇంకా మా చెవుల్లో మార్మోగుతూనే ఉంది : ఇజ్రాయెల్‌ నుంచి వచ్చిన భారతీయులు

-

ఇజ్రాయెల్‌-హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్​లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి సురక్షితంగా తరలించేందుకు కేంద్ర సర్కార్ ఆపరేషన్ అజయ్ చేపట్టింది. ఇందులో భాగంగా ఇవాళ చార్టర్ట్ ఫ్లైట్​లో 212 మంది భారతీయులు ఇజ్రాయెల్​ నుంచి దిల్లీకి చేరుకున్నారు. వారి స్వదేశంలో కాలు పెట్టగానే తమను ప్రాణాలతో భారత్​కు తీసుకువచ్చినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పారు.

అనంతరం ఇజ్రాయెల్​లో పరిస్థితులపై మాట్లాడుతూ.. అక్కడ సాధారణ పరిస్థితులనేవే లేవని చెప్పారు. “ఆ రోజు ఎయిర్‌ రెయిడ్‌ సైరన్ల మోతతో నిద్రలేచిన మేం ఏం జరుగుతుందో తెలుసుకునేలోగా భారీ శబ్ధాలతో రాకెట్ల వర్షం కురిసింది. ఇజ్రాయెల్‌ అధికారులు మమ్మల్ని సమీపంలోని షెల్టర్లలోకి వెళ్లమన్నారు. మేం బయల్దేరే సమయంలో కూడా సైరన్లు మోగుతూనే ఉన్నాయి. ఆ సైరన్ల మోత ఇంకా మా చెవుల్లో మోగుతూనే ఉంది. ఆ భయానక పరిస్థితులను వర్ణించలేం. వాటి నుంచి ఇప్పట్లో బయటపడలేం. మమ్మల్ని క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు’’ అని వారు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version