హైదరాబాద్​లో మరో విషాదం.. బోరబండలో ఇద్దరు కొడుకులకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

-

సికింద్రాబాద్​లో ఇవాళ బోయిన్‌పల్లిలో తండ్రీబిడ్డల ఆత్మహత్యకు కారణాలు తెలియకముందే మరో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోనూ అదే తరహాలో చోటుచేసుకున్న మరో ఘటన తీవ్ర మరో కుటుంబంలో విషాదాన్ని నింపింది. బోరబండ పరిధిలోని మధురానగర్‌లో ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలతోనే ఘటనకు కారణంగా తెలుస్తోంది.

బోరబండ మధురానగర్‌కు చెందిన విజయ్‌ భార్య జ్యోతి…. బంజారాహిల్స్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. విజయ్‌-జ్యోతి దంపతులకు అర్జున్‌, ఆదిత్య అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఉదయం 8గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో జ్యోతి…. తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చింది. అనంతరం, తానూ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

కుటుంబసభ్యులు గమనించేలోగా జ్యోతి శవం వేలాడుతూ కనిపించగా  ఇద్దరు పిల్లలు విగతజీవులుగా పడి ఉన్నారు. తల్లీపిల్లల మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ కలహాలతోనే బిడ్డలతో కలిసి జ్యోతి ప్రాణాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version