సెబీ చీఫ్ మాధబి బుచ్‌కు నెలాఖరులోగా పీఏసీ నోటీసులు?

-

సెక్యూరిటీస్ ఎక్సేంఛ్ బోర్డు ఆఫ్ ఇండియా (SEBI)చీఫ్ మాధబి బుచ్‌పై వస్తున్న ఆరోపణలపై విచారించేందుకు పార్లమెంట్ పీఏసీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈనెలాఖరులోగా ఆమెతో పాటు ఫైనాన్స్ మినిస్ట్రీలోని కొందరు అధికారులకు కమిటీ సమన్లు జారీచేయనున్నట్లు సమాచారం. చట్టం ద్వారా నెలకొల్పిన నియంత్రణ సంఘాల పనితీరును సమీక్షించే అధికారం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ)కి ఉంటుంది. ప్రస్తుతం దీనికి కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ సారథ్యం వహిస్తున్నారు. మాధబిపై ప్రతిపక్ష పార్టీ నేతలు ఇప్పటికే పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

ఇటీవల సెబీ చీఫ్ మాధబి బుచ్‌పై హిండెన్ బర్గ్ నివేదిక కూడా పలు ఆరోపణలు చేసింది. అదానీ కంపెనీకి సెబీ క్లీన్ చిట్ ఇవ్వడానికి గల కారణాలను కూడా తాజా నివేదికలో హిండెన్ బర్గ్ ప్రస్తావించింది. అదానీ కంపెనీల్లో మాధబికి షేర్లు ఉన్నాయని, పరస్పర ఆమోదంతో కూడిన లావాదేవీలు జరిగాయని అందుకే సెబీ చీఫ్ అదానీ గోల్‌మాల్‌ను కప్పిపుచ్చిందని పేర్కొంది. అంతేకాకుండా ఇటీవల సెబీ నుంచే కాకుండా ఐసీఐసీఐ నుంచి కూడా జీతం తీసుకుంటున్నారని ఆరోపించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news