మేడిన్ ఇండియా మిస్సైళ్లు, డ్రోన్లు, పాకిస్తాన్ ను చీల్చిచెండాడాయని ప్రధాని నరేంద్ర మోడీ లోక్ సభలో పేర్కొన్నారు. ఉగ్రవాద ప్రభుత్వం, ఉగ్రనేతలను వేర్వేరుగా చూడటం లేదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ కు ప్రపంచమంతా మద్దతుగా నిలిచింది. కానీ కాంగ్రెస్ సపోర్ట్ సాధించలేకపోయాం.. ఆ పార్టీ రాజకీయాలు చేస్తోంది. పాకిస్తాన్ కి కేవలం మూడు దేశాలు మాత్రమే మద్దతు ఇచ్చాయని తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ చేపడుతామని పాకిస్తాన్ కలలో కూడా ఊహించలేదు. మన దాడులతో పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది. కాల్పుల విరమణకు పాక్ ప్రాధేయపడింది. ఆపరేషన్ సిందూర్ మన ఎయిర్ ఫోర్స్ 100 శాతం విజయం సాధించిందని ప్రధాని మోడీ తెలిపారు. ఉగ్రవాదాన్ని అణచివేయడమే మన లక్ష్యం. మన మిస్సైల్స్ పాకిస్తాన్ లోని మూల మూలకు చొచ్చుకుపోయాయని.. మన సైన్యం సత్తా ఏంటో ప్రపంచం మొత్తం చూసింది. ఊహించని రీతిలో పాక్ ను భారత్ చీల్చి చెండాడింది. ఇక చాలు అంటూ DGMO ల మీటింగ్ లో పాక్ ప్రాధేయపడిందని తెలిపారు ప్రధాని మోడీ.