కేశినేని నాని షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఈడీకి కేశినేని నాని లేఖ రాశారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ కేశినేని చిన్ని, అతడి అనుచరుల పాత్రపై దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేసారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్, కేశినేని చిన్నిపై నమ్మకం లేనందున CBI దర్యాప్తు కోరారు కేశినేని నాని.

ఇది ఇలా ఉండగా, బీజేపీలోకి మాజీ ఎంపీ కేశినేని నాని వెళతాడని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో మాజీ ఎంపీ కేశినేని నాని మంతనాలు పూర్తి అయ్యాయని చెబుతున్నారు. అనుచరులతో ఆంతరంగిక భేటీలు జరుపుతున్నారట మాజీ ఎంపీ కేశినేని నాని. త్వరలోనే బీజేపీ పార్టీలో చేరికపై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందట మాజీ ఎంపీ కేశినేని నాని.