“ఆపరేషన్ సింధూర్” పై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రియాక్టు అయ్యారు. పాకిస్తాన్ లోని 5 ప్రాంతాల్లో భారత్ దాడులు చేసిందని వెల్లడించారు. భారత్ చర్యలకు పాకిస్తాన్ కచ్చితంగా బదులు తీర్చుకుంటుందని పేర్కొన్నారు.

శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్, ఆర్మీకి తెలుసు అన్నారు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. భారత మెరుపుదాడులపై ఎక్స్ వేదికగా స్పందించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్… ఈ మేరకు వార్నింగ్ ఇచ్చాడు.
కాగా, అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో… పాకిస్తాన్ చుక్కలు చూస్తోంది. ఇప్పటివరకు జరిగిన దాడులలో మొత్తం 30 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం అందుతుంది. ఈ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించినట్లు సమాచారం అందుతుంది.