ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆపరేషన్ సింధూర్ ను… పాకిస్థాన్ ను అంతం చేసేందుకు ఇండియన్ ఆర్మీ ప్రారంభించేసింది. 1971 తర్వాత తొలిసారి పాకిస్థాన్ భూభాగంలో భారత్ దాడులు చేసింది. ఈ తరుణంలోఈ భారత్-పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో 9 ఎయిర్‌పోర్ట్‌లు మూసివేసారు.

ధర్మశాల, లే, జమ్మూ, శ్రీనగర్, అమృతసర్‌తో సహా కీలక విమానాశ్రయాల్లో విమానల రాకపోకలు రద్దు అయ్యాయి. 9 నగరాలకు విమానాల రాకపోకల రద్దు చేసిన ఎయిర్ ఇండియా… ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని విమానాలు రద్దు చేసింది.
అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో… పాకిస్తాన్ చుక్కలు చూస్తోంది. ఇప్పటివరకు జరిగిన దాడులలో మొత్తం 30 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం అందుతుంది. ఈ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించినట్లు సమాచారం అందుతుంది.