జమ్మూలో హై అలెర్ట్. జమ్మూ ఎయిర్‌పోర్ట్‌ను టార్గెట్ చేసింది పాకిస్థాన్ దేశం. జమ్మూ ఎయిర్‌పోర్ట్ దగ్గరకు 8 మిస్సైల్స్ దూసుకొచ్చాయి. అయితే పలు చోట్ల డ్రోన్లను కూల్చివేసింది ఇండియన్ ఆర్మీ. జమ్మూలో ఏడు చోట్ల పేలుడు శబ్దాలు కూడా వచ్చాయి. జమ్మూ వ్యాప్తంగా విద్యుత్ సరఫరా బంద్ చేశారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని సూచనలు చేశారు.

అటు బాల్‌కోట్, రాజస్థాన్, గురుదాస్‌పూర్‌పై పాక్ ఎటాక్ చేసింది. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ వద్ద, సాంబా సెక్టార్‌లలో భారీగా పేలుడు శబ్దాలు వచ్చాయి. జమ్మూ యూనివర్సిటీ దగ్గర రెండు డ్రోన్లు కుళాయి. దింతో కుప్వారాలో సైరన్ మోగింది. అటు పాకిస్థాన్‌పై ఎదురుదాడి మొదలుపెట్టింది భారత్. పలు చోట్ల పాక్ డ్రోన్లను కూల్చివేసిన భారత సైన్యం… పాక్‌కు చెందిన F-16 ఫైటర్‌జెట్‌ను కూల్చేసింది.