పాక్ దాడుల నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్ రద్దు అయింది. పాక్, ఇండియా వార్ ప్రభావం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ మ్యాచ్‌పై పడింది. జమ్మూ ఎయిర్ పోర్టుపై పాక్ దాడి చేయడంతో అప్రమత్తమైన సైన్యం ధర్మశాలలోనూ బ్లాక్ అవుట్ ప్రకటించింది. విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. ఫ్లడ్ లైట్స్ బంద్ కావడంతో సగంలోనే మ్యాచ్ నిలిచిపోయింది.

ఇక అటు జమ్మూ ఎయిర్‌పోర్ట్‌ను టార్గెట్ చేసింది పాకిస్థాన్ దేశం. జమ్మూ ఎయిర్‌పోర్ట్ దగ్గరకు 8 మిస్సైల్స్ దూసుకొచ్చాయి. అయితే పలు చోట్ల డ్రోన్లను కూల్చివేసింది ఇండియన్ ఆర్మీ. జమ్మూలో ఏడు చోట్ల పేలుడు శబ్దాలు కూడా వచ్చాయి. జమ్మూ వ్యాప్తంగా విద్యుత్ సరఫరా బంద్ చేశారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని సూచనలు చేశారు.
- పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ రద్దు
- ఐపీఎల్‌లో నేడు ధర్మశాల స్టేడియంలో జరుగుతున్న పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ రద్దు
- సరిహద్దుల్లో పాకిస్థాన్ దాడుల నేపథ్యంలో మ్యాచ్ రద్దయినట్లు సమాచారం