జమ్మూ వ్యాప్తంగా విద్యుత్ సరఫరా బంద్ చేశారు. జమ్మూలో హై అలెర్ట్. జమ్మూ ఎయిర్‌పోర్ట్‌ను టార్గెట్ చేసింది పాకిస్థాన్ దేశం. జమ్మూ ఎయిర్‌పోర్ట్ దగ్గరకు 8 మిస్సైల్స్ దూసుకొచ్చాయి. అయితే పలు చోట్ల డ్రోన్లను కూల్చివేసింది ఇండియన్ ఆర్మీ. జమ్మూలో ఏడు చోట్ల పేలుడు శబ్దాలు కూడా వచ్చాయి.
జమ్మూ వ్యాప్తంగా విద్యుత్ సరఫరా బంద్ చేశారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని సూచనలు చేశారు. అటు పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం చేశారు. అధికారులకు సెలవులు రద్దు చేసి.. విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. అధికారులు ఎవరూ జిల్లా దాటి వెళ్లవద్దని, అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడారు ప్రధాని మోదీ.